జూలై 22 నుండి ఆగస్టు 16 వరకు దేశ రాజధానిలో ఆంక్షలు

-

ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీ పోలీసులు నిషేధ ఉత్తర్వులు విడుదల చేశారు. పారా-గ్లైడర్లు, పారా-మోటర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, యూఏవీలు, యూఏఎస్ఎస్‌లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, స్మాల్ సైజ్డ్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాజంపింగ్‌లను రాజధాని గగనతలంలో ఎగురకుండా నిషేధాజ్ఞలు విధించారు. జూలై 22 నుండి ఆగస్టు 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

10,000 Cops To Be Deployed Around Red Fort On Independence Day: Delhi Police

ఢిల్లీలో ప్రతిఏటా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు నెలరోజుల ముందు నుంచి ఢిల్లీని జల్లెడ పడుతుంటారు. అనుమానస్పద వ్యక్తులను, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఉగ్రవాద చర్యలపై నిఘా వేస్తారు. దేశ ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. రద్దీ ఉండే ప్రాంతాల్లో వాహనాలను తనిఖీలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news