ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. రోజు రోజుకి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మహిళలు, రైతులు, పిల్లలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే దాదాపు పది రోజుల క్రితం మహిళలు నిరసన చేస్తుంటే మహిళా పోలీసులు వారి విషయంలో దురుసుగా ప్రవర్తించారు. రోడ్ల మీద నిరసన చేస్తున్న వారిని బలవంతంగా పోలీస్ వ్యానుల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీనిపై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన తెలుపుతున్న మహిళా రైతులపై పోలీసులు దుర్భాషలు ఆడారని, అదే విధంగా వారిని కొట్టారని,
జాతీయ మహిళా కమీషన్ కి ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుంది. దీనిపై జాతీయ మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ మాట్లాడుతూ, “ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు నోటీసులు జారీ చేశాం. సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరాం. మహిళా రైతుల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తుంది. వారితో పోలీసులు ప్రవర్తించిన విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె అసహనం వ్యక్తం చేసారు.