మళ్లీ ఓడిన హైదరాబాద్‌.. ఢిల్లీ ఘన విజయం

ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 92 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 67 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. నికోలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు. ఖలీల్‌ అహ్మద్‌ 3, శార్దుల్‌ 2 వికెట్లు తీశారు.

DC Vs SRH 2022: वॉर्नर-पॉवेल के बाद दिल्ली की जीत में चमके खलील अहमद, हैदराबाद को 21 रनों से दी मात DC vs SRH live score sunrisers hyderabad vs delhi capitals match

ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగితే హైదరాబాద్‌ ఖాతా (వికెట్‌) తెరిచింది. భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌ వికెట్‌గా తీశాడు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా ఢిల్లీ పుంజుకుంది. ఈ లీగ్‌లోనే ‘స్పీడ్‌స్టర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌ను తొలి ఓవర్‌ నుంచే ఉతికేశారు. 4వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో వార్నర్‌ 21 పరుగులు పిండుకున్నాడు. మార్‌‡్ష (10) అవుటైనా… కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), వార్నర్‌ ఇద్దరు ఇన్నింగ్స్‌ను మెరుపులతో దారిలో పెట్టారు.