ఎంతో రుచికరమైన క్రిస్పీ బ్రౌన్ రైస్ దోస రెసిపీ మీకోసం..!

-

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేటి కాలంలో చాలా మంది సాధారణ బియ్యం కంటే కూడా బ్రౌన్ రైస్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే బ్రౌన్ రైస్ తో కేవలం అన్నం మాత్రమే కాదు వివిధ రకాల రెసిపీస్ ని మనం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా రుచి కూడా బాగుంటుంది. కాబట్టి తినడానికి చిన్న పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రోజు మనం బ్రౌన్ రైస్ దోస ( Brown Rice Dosa ) ఎలా తయారు చేసుకోవాలి..?, బ్రౌన్ రైస్ రెసిపీ కి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది చూద్దాం. ఈ బ్రౌన్ రైస్ దోస లో పప్పులు కూడా ఉంటాయి కనుక ఇది ఆరోగ్యానికి మరింత మేలు.

Brown Rice Dosa | బ్రౌన్ రైస్ దోస | బ్రౌన్ రైస్ రెసిపీ
Brown Rice Dosa | బ్రౌన్ రైస్ దోస | బ్రౌన్ రైస్ రెసిపీ

బ్రౌన్ రైస్ దోసకి కావలసిన పదార్ధాలు:

  • రెండు కప్పుల బ్రౌన్ రైస్
  • ముప్పావు కప్పు మినప్పప్పు
  • రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు
  • అర టీ స్పూన్ మెంతులు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నెయ్యి లేదా నూనె

బ్రౌన్ రైస్ దోస తయారు చేసే విధానం:

ముందుగా బ్రౌన్ రైస్ తీసుకుని దాని నిండా నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే విధంగా మినప్పప్పు, శనగపప్పు, మెంతులు కూడా ఒక బౌల్లో వేసి నిండా నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

నాలుగు గంటల తరువాత ఆ నీళ్లు తీసేసి ఒక్కసారి శుభ్రంగా కడిగేసి అన్నిటినీ మెత్తని పేస్టులాగ రుబ్బుకోవాలి. సాధారణంగా మనం దోస రుబ్బు ఎలా అయితే గ్రైండ్ చేస్తామొ అలానే ఈ పిండిని కూడా గ్రైండ్ చేసుకోండి.

ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ వేసి బాగా కలుపుకొని నాన్ స్టిక్ పాన్ ని స్టవ్ మీద పెట్టి పాన్ వేడెక్కిన తరవాత కొద్దిగా నూనె వేసుకుని దోసే మాదిరి పెనం మీద వేసుకోవాలి. నెయ్యి లేదా నూనె తో అచ్చం దోస లాగే కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఎంతో ఈజీగా క్రిస్పీ దోశలుని తయారు చేసుకోవచ్చు.

ఎనర్జీ: 81 క్యాలరీలు
ప్రోటీన్: 2.1 గ్రాములు
కార్బోహైడ్రేట్స్ 11.5 గ్రాములు
ఫైబర్: ఒక గ్రాము
కొవ్వు: 2.9 గ్రాములు
కొలెస్ట్రాల్: 0mg
సోడియం 2.9mg

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

brown rice white rice
brown rice white rice

తెల్ల బియ్యం నిజంగా మంచివి కావా? బ్రౌన్ రైస్ నిజంగా మంచివా? బ్రౌన్ రైస్, వైట్ రైస్.. రెండింటిలో ఏది మంచిదంటే తెలుసుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news