బ్రౌన్ రైస్, వైట్ రైస్.. రెండింటిలో ఏది మంచిదంటే…!

-

చాలా రోజులుగా బియ్యం గురించిన వస్తున్న వార్తలు అందరికీ అనేక అనుమానాల్ని కలిగిస్తున్నాయి. తెల్లబియ్యం మంచివి కావనీ, వాటి స్థానంలో రిఫైన్ చేయని బ్రౌన్ రైస్ వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. ఐతే తెల్ల బియ్యం నిజంగా మంచివి కావా? బ్రౌన్ రైస్ నిజంగా మంచివా అన్న విషయం ఈ రోజు తెలుసుకుందాం.

రిఫైన్ చేయరు కాబట్టి బ్రౌన్ రైస్ మంచివని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో పూర్తిగా నిజం లేదు. కొంతమందికి అది నిజమే అవ్వచ్చు కానీ, అందరి దృష్టిలోకి తీసుకుంటే, బ్రౌన్ రైస్ కంటే వైట్ రైసే బెటర్ అని చాలా మంది పోషకాహార నిపుణుల అభిప్రాయం. దానికి గల కారణాలేంటో చూద్దాం.

సాధారణంగా మనకి దొరికే అన్ని గింజల్లో రైస్ ఒక్కటే తొందరగా జీర్ణం అవుతాయి. ఐతే బ్రౌన్ రైస్ అంత త్వరగా జీర్ణం కాదు. దానిపై ఫిటిక్ ఆసిడ్ అని ఉంటుంది. దానివల్ల జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత హాని కలిగించే అవకాశం ఉంది. రిఫైన్ చేయబడని బియ్యపు గింజలు భూమిలో పడితే మొక్క తొందరగా బయటకి వస్తుంది. వాటిని రిఫైన్ చేయకుండా డైరెక్టుగా గింజలనే తినడం వల్ల జీర్ణ సమస్యలు అధికం అవుతాయని చెబుతున్నారు.

బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ అనే భారలోహం ఉంటుంది. దాని కారణంగా అనేక ఇతర సమస్యలు వస్తాయి. ఇక రుచి విషయానికి వస్తే వైట్ రైస్ చాలా ప్రత్యేకం. స్టీమ్ చేసిన వైట్ రైస్ లో జింక్ శాతం ఎక్కువగా ఉంటుందట. శరీరానికి కావాల్సిన మాంగనీస్ కూడా అధికంగా ఉంటుంది.

ఏది ఏమైనా జీర్ణ సమస్యలు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినకుండా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news