తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి పరిస్థితుల పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమి గూడకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర పండగల సందర్భంగా జనం గుమిగూడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత ముందుగా ప్రజలకు తెలపాలని పేర్కొన్న హైకోర్టు.. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా వివిధ అంశాల ఆధారంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. సీరో సర్వైలెన్స్ వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి పై ఏర్పాటైన కమిటీ సమావేశం వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల పై కేసు విచారణ ను సెప్టెంబరు 8 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాగా తెలంగాణ లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే.