నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య మాటల యుధ్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ నివాసం వద్దకు వస్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు తానే స్వయంగా వెళ్తానని అరికెపూడి గాంధీ వెళ్లారు.
తాజాగా కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు అరికెపూడి గాంధీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేసిన ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ అనుచరులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరి పై మరొకరూ రాళ్లు కూడా రువ్వుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు రాళ్లు, కత్తులతో దాడి చేస్తున్నారని పేర్కొంటున్నారు కౌశిక్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన దాడికి ప్రతిదాడి తప్పకుండా ఉంటుందని తెలిపారు. 101 శాతం దాడి చేస్తామని కౌశిక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.