తమిళనాడు తీరాన్ని తాకిన వాయుగుండం.

-

తమిళనాడు రాష్ట్రాన్ని వాయుగుండం వణికిస్తోంది. తాజగా వాయుగుండం తమిళనాడు తీరాన్ని తాకింది. ఇది మహాబలిపురం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూర్, చిత్తూర్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తమిళ నాడులో కురిసిన భారీవర్షాలతో ఇప్పటికే 14 మంది మరణించారు. వర్షం ఈదురుగాలుల కారణంగా చెన్నైకి వచ్చే పలు విమానాలు రద్దయ్యాయి. కొన్నింటిని రూట్ మార్చారు. ఇటు తిరపతిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే వర్షపాతం 10 సెంటీమీటర్లను దాటింది. జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. పాపనాశం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తేశారు. తిరపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునిగాయ. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలను తమిళనాడులో, రెండింటిన పాండిచ్చేరిలో, మరో 5 టీములను ఆంధ్ర ప్రదేశ్ లో మోహరించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news