పవన్ కు డాన్సులు, ఫైట్లు తప్ప… రాజకీయాలు పనికి రావు : డిప్యూటీ సీఎం ధర్మాన

-

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన మంచి నాయకుడని ఎద్దేవా చేశారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్‌.. మంచి డాన్సులు , ఫైట్లు చేస్తాడని కానీ..రాజకీయాలు పనికి రావని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా , సినీ హీరోగా పవన్ కళ్యాణ్ అంటే నాకూ అభిమానమేనని పేర్కొన్న ధర్మాన… కానీ పవన్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

జగన్ తో తనను పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదని… పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు జగన్ అని కొనియాడారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు జగన్… అని.. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరన్నారు. జగన్ కు పోటీ ఎవరూ లేరు…జగన్ కు జగనే సాటి అని కొనియాడారు. జగన్ ను విమర్శించే ముందు పవన్ , లోకేష్ విజ్ఞతతో ఆలోచించాలని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news