హైకోర్టులో జగన్ సర్కార్ ఎదురు దెబ్బ

-

అమరావతి : ఎయిడెడ్ కళాశాలల విషయం లో జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎయిడెడ్ కళాశాల లకు ఎయిడ్ నిలిపి వేయడం, కళాశాలల స్వాధీనం పై హైకోర్టు లో పిటీషన్ దాఖలు అయింది. పిటీషనర్ల తరపున వాదనలు వినిపించారు న్యాయవాది నర్రా శ్రీనివాస్.

ఎయిడెడ్ కళాశాల ల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన న్యాయవాది శ్రీనివాస్… తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు ప్రభుత్వ న్యాయవాది. లిఖిత పూర్వకం గా ఆదేశాలు ఇచ్చారని చదివి వినిపించిన న్యాయవాది శ్రీనివాస్… అడ్మిషన్లు జరగక పోతే లక్షలాది మంది విద్యార్దులు నష్ట పోతారని ధర్మాసనం దృష్టి కి తీసుకు వచ్చారు. అడ్మిషన్లు నిర్వహించు కోవచ్చని యాజ మాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది హై కోర్టు. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్ పై విచారణ చేపడ తామని స్పష్టం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Latest news