ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.ఇక జనసేన నుంచి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖలు చంద్రబాబు కేటాయించారు.
కానీ ఇప్పటివరకూ బాధ్యతలు చేపట్టలేదు. ఈ నెల 19న ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్‌లో చాంబర్ కేటాయించారు. సచివాలయం రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212వ రూమ్‌లోనే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పవన్ ఛాంబర్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం ఉంటారని అధికారులు వెల్లడించారు.