ప్రభుత్వం, అధికారులపై అనవసరమైన, వివాదస్పదమైన వ్యాఖ్యలు చేయవద్దని జనసేన కేడర్‌కు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారని ఆ పార్టీ నేత వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు.
అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో రాష్ట్ర పాలనా పగ్గాలను ఎన్‌డీఏ చేపట్టిందని, ఈ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని పవన్ కోరానని వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జనసేనాని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా.., అధికారుల పని తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ వార్నింగ్ ఇచ్చారు ” అని వేములపాట అజయ్ కుమార్ వెల్లడించారు.