అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా : ట్రోలర్స్ కు దేత్తడి హారిక వార్నింగ్

-

బిగ్ బాస్ బ్యూటీ, దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెబ్ సిరీస్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తో తన క్రేజ్ ను ఎంతో పెంచుకుంది. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు అలాగే నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పాల్గొని ఫినాలే వరకు వెళ్ళింది. దీంతో టాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లోనూ హారిక ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఈ మధ్య ఈ భామ కు సోషల్ మీడియాలో కామెంట్ల బెడద ఎక్కువైంది. ఆమె ఫోటోను చూసి హైట్ గురించి చులకన చేసి కొందరు మాట్లాడుతున్నారు. పొట్టిది, బుడ్డది అంటూ రకరకాల కామెంట్ పెడుతూ ఆమెను హింసిస్తున్నారు. అయితే ఇలాంటి నెటిజన్లకు దేత్తడి హారికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా అంటూ ఎన్టీఆర్ డైలాగ్ తో రెచ్చిపోయింది దేత్తడి హారిక. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమాని అయి ఉండాలి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది దేత్తడి హారిక. తన పోస్ట్ అర్థమైంది కదా అంటూ ట్రైలర్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news