భారీ ధరకు ‘దేవర’ మూవీ నార్త్ రైట్స్ ?

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే…’దేవర’ మూవీ నార్త్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులను రూ. 50 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.130 కోట్లకు థియేట్రికల్ రైట్స్ విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news