కరోనా కారణంగా అన్ని రకాల ఉత్సవాలు రద్దయ్యాయి. లక్షల్లో జనం హాజరయ్యే బన్ని ఉత్సవ వేడుకలు కూడా రద్దు చేశారు అధికారులు. ప్రతీ ఏటా దసరా సందర్భంగా ఈ బన్నీ ఉత్సవం జరుగుతుంది. కర్రల సమరంలో యువత రక్తం చిందిస్తుంటారు. రోడ్లపైకి చేరి కర్రలతో కొట్టుకుంటారు స్థానికులు. అయితే కొవిడ్ కారణంగా ఈ ఉత్సవాలు రద్దు చేశారు పోలీసులు. కానీ కర్రల సమరం నిర్వహించాలని యువకుల పట్టు పడుతున్నారు. వ్యాధి విజృంభించే ప్రమాదం ఉండటంతో నిషేధం విధించారు. గుంపులుగా జనం ఒకే చోట చేరొద్దని పోలీసుల సూచనలు చేస్తున్నారు.
ఈ వేడుకలకు పొరుగు రాష్ట్రాల నుంచి జనం రావడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పటంతో చేతులు ఎత్తేస్తున్నారు పోలీసులు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారా?పోలీసుల కఠిన ఆంక్షలతో రద్దవుతాయా?అనేది ఉత్కంఠగా మారింది. ఎన్ని ఆంక్షలు విధించినా బన్నీ ఉత్సవాలను మాత్రం ఆపలేరనేది గత అనుభవాలే చెబుతున్నాయి. దేవరగట్టుకు వెళ్లే అన్ని దారులు క్లోజ్ చేసి ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, వాహనాల రాకపోకలను నిలిపివేసి దేవరగట్టులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.