కుటుంబ పార్టీల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతోంది – సోము వీర్రాజు

-

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. చేజర్ల మండలం లో ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించారని అన్నారు. పూర్తి ఆధారాలతో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు సోము.

ఈ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థలో వాలంటీర్ లను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోకుండా వైసిపి నాయకుల వనరులను పెంచుతోందన్నారు. సిలికా, ఇసుక గ్రావెల్, ప్రభుత్వం లో ఉండే నాయకులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీల వలన ఆంద్రప్రదేశ్ అభివృద్ది కుంటుపడుతోందన్నారు సోము వీర్రాజు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లుతో పాటు వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో కేంద్రం నిధులు ఇస్తూ అభివృద్ధి చేస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news