జగన్ పై దేవినేని ఫైర్…!

-

 

పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో ఏపీ సర్కార్ కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రంగులు మార్చాల్సిందే.. ప్రభుత్వం ఇచ్చే పాలనాపరమైన ఆదేశాలేవైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి. కోర్టు తీర్పు పాటించకపోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. మెజారిటీ వచ్చిన అహంకారంతో పాలకులు మూర్ఖంగా వ్యవహరించి వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారు దీనికేనా ఒకఛాన్స్ అడిగింది చెప్పండి  వైఎస్‌ జగన్ గారు’ అని ట్విట్టర్‌లో నిలదీశారు. అలాగే ఇసుక కొరతపై జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ “ఇంటింటికి ఇసుకచేరవేతలో చేతివాటం యాప్ రూపకల్పనలో కిరికిరితో ఒకేబిల్లుపై 4,5ట్రిప్పులు చెప్పినట్రిప్పులు వేస్తేనే రవాణాకుఅనుమతి రీచ్ నుండి స్టాక్ యార్డ్ వరకు కొంతమంది మీమంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు సామాన్యుడికి దొరకకుండాచేస్తున్న ఇసుకదోపిడీకి ఏంసమాధానంచెప్తారు జగన్ గారు” అంటూ మరో ట్వీట్ కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news