రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి కాసేపటి క్రితమే… మాజీ మంత్రి దేవినేని ఉమా విడుదల అయ్యారు. సెంట్రల్ జైలు నుంచి విడుదల అనంతరం… ఆయన విజయవాడ బయలుదేరారు. సెంటర్ జైలు వద్ద ఉమాను మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కలిశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ… ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు మద్దతు ఇచ్చి తనకు ధైర్యం చెప్పారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలపై ఉధ్యమాలు తీవ్రం చేస్తామని వైసీపీ సర్కార్ ను హెచ్చరించారు. అరెస్టు సమయంలో సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నా..తన పైన, పోలీసులపైన కూడా వైసిపి నేతలు దాడి చేశారని ఆరోపణలు చేశారు దేవినేని ఉమా. కాగా.. నిన్న దేవినేని ఉమాకు ఏపీ హై కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.