సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌కు జగన్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చారు. తెలంగాణ జర్నలిస్టు, సాక్షి టీవీలో డిబేట్ యాంకర్ గా పనిచేసిన అమర్ ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా మరియు ఇంటర్ స్టేట్ ఎఫైర్స్ సలహాదారుగా నియమించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతనికి సీనియర్ ఐఏఎస్ లను మించి జీతం, సదుపాయాలు అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం సాక్షిలో ఉద్యోగిగా జీతం తీసుకుంటున్న దేవులపల్లి అమర్ ఇక నుంచి.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉంటారు.
దేవులపల్లి అమర్ కు నెలకు అక్షరాలా 3లక్షల 82వేల రూపాయల జీతం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో నేరుగా 2లక్షలు జీతం కాగా, వ్యక్తిగత సహాయకులు అంటే ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్లకు నెలకు 70వేలు చెల్లించనున్నారు. ఇక ఫోన్ బిల్లు 2వేలు, ఇంటి అద్దె 50వేలు ఇవ్వనున్నారు. ఇవికాకుండా మెడికల్ రీఎంబర్స్ మెంట్, సెకండ్ క్లాస్ ట్రైన్ ఛార్జీలు, ఎకానమీ ఫ్లైట్, అలాగే బిజినెస్ క్లాస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఛార్జీలు అదనంగా చెల్లించనున్నారు. ఇక మొత్తం నెలకు రూ.3,82,000 దేవులపల్లి అమర్ బ్యాంక్ అకౌంట్‌లో పడనుంది.