టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతిపెద్ద కాంబినేషన్ మహేష్-రాజమౌళి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎప్పుడో 2003 సింహాద్రి సినిమా వచ్చినప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి. అయితే సింహాద్రి వచ్చి 16 ఏళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక పవన్‌కళ్యాణ్ – రాజమౌళి కాంబినేషన్ కోసం సైతం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి 19 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం 12 సినిమాలు మాత్రమే చేశాడు.
ఈ సినిమాల్లో ఎన్టీఆర్, ప్రభాస్‌తోనే మూడు సినిమాలు చేవాడు. ఇక రామ్‌చరణ్, సునీల్,నాని, రవితేజ, నితిన్ లతో తలో ఒక మూవీ చేశారు. ఇక ఇప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎన్టీఆర్‌తో నాలుగోది, రామ్‌చరణ్‌తో రెండోది అవుతుంది. రాజమౌళి ఇంత మంది హీరోలతో చేసినా కానీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్, పవన్ కళ్యాణ్ లతో ఆయన ఇంత వరకు మూవీ చేయలేదు.
ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి చేయబోయేది మహేష్ తోనే అని ఒక రూమర్ కొద్దిరోజులుగా పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అలాగే రాజమౌళి ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కేఎల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఎప్పుడో కేఎల్.నారాయణ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు.