ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన అమానవీయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసిన నలుగురు యువకులని కఠినంగా శిక్షించాలంటూ ఆ బాలికకి, కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద నిరసనలు చేపడుతున్నాయి. ఐతే తాజాగా ఉత్తరప్రదేశ్ డీజీపీ అవస్థి, బాధితురాలి కుటుంబ సభ్యులని కలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితికి దారి రీసిన కారణాలను కనుక్కునే పనిలో డీజీపీ బాధితురాలి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాధితురాలి శవాన్ని కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా కాల్చడంపై ప్రశ్నిస్తే, అదంతా లోకల్ లెవెల్ లో జరిగింది. దానిపై ఎలాంటి కామెంట్ చేయలేనని తెలిపాడు. కుటుంబ సభ్యులకి కనీస సమాచారం అందించకుండా అంత్యక్రియలు ఎలా చేస్తారని అడగ్గా డీజీపీ నుండి ఈ సమాధానం వచ్చింది.