తప్పుడు బుద్ధితో ఉద్యోగం పోగొట్టుకున్న డీఎస్పీ

-

కక్కుర్తి బుద్ధి, పరాయి స్త్రీలపై వ్యామోహంతో డీఎస్పీ ఉద్యోగాన్ని కోల్పోయాడు దుర్గాప్రసాద్ అనే కామాంధుడు. డీఎస్పీ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తున్నట్లు సోమ‌వారం సస్పెండ్ ఉత్తర్వులను ఏపి డీజీపీ ఆర్పీ ఠాకూర్ జారీ చేశారు. తన భార్యతో మంగళగిరి బెటాలియన్స్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని తిరుచానూరు పోలీస్టేషన్‌లో రెడ్డిప్రసాద్‌ అనే బాధిత వ్యక్తి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో దుర్గా ప్రసాద్ భాగోతం బయటపడింది.  రెడ్డిప్రసాద్‌ భార్య ధనలక్ష్మిని ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే హైదరాబాదులోని సొంత నివాసంలో ఉంటూ ఫార్మా కంపెనీలో సహాయకునిగా పనిచేస్తు తన జీవనాన్ని గడుపుతున్నాడు. ఏడాది క్రితం అక్కడే డీఎస్పీ గా పనిచేసే దుర్గాప్రసాద్‌ మార్నింగ్‌ వాక్‌ ద్వారా ధనలక్ష్మితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. దీంతో ఆమెను పక్కదోవ పట్టించాడు. తన భర్త రెడ్డిప్రసాద్‌కు టిటిడిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలతో నమ్మించి సంవత్సరం కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు.

ఉద్యోగ రీత్యా తిరుపతిలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని రెడ్డిప్రసాద్‌ భార్యతో ఒత్తిడి తెచ్చాడు. భార్యను నమ్మి హైదరాబాదులోని సొంత ఇంటిని వదిలి తిరుపతి సమీపంలోని తిరుచానూరు గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని వారు కాపురం ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా తాను హైదరాబాదుకు వెళ్లి పది లేదా పదిహేను రోజులకొకసారి ఇంటికొచ్చేవాడు. ఈ క్రమంలోనే తన అమ్మ, వికలాంగుడైన తన నాన్న తిరుచానూరులోని ఇంటికి రావడంతో వారి బాగోతం బయటపడింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దుర్గాప్రసాద్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news