24 గంటల్లో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్‌.. సాధ్యం కాదన్న రష్యా

-

తాను అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని తన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పదే పదే చెబుతున్నారు. అయితే దీనిపై తాజాగా రష్యా స్పందిస్తూ.. అది సాధ్యం కాదని వాదిస్తోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక్క రోజులో పరిష్కరించదగిన అంశం కాదని స్పష్టం చేసింది.

యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ తొలిసారి అన్నారు. తనకు అవకాశం లభిస్తే ఈ మారణహోమాన్ని ఆపేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా తాజాగా స్పందించారు. ఏప్రిల్‌ 2022లో ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని అది సఫలీకృతమైతే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని అవన్నీ మర్చి ఇప్పుడు ‘శాంతి ఒప్పందం’ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news