అప్పుడే డిసైడ్ అయ్యాం.. తెలుగు వాళ్లు అద్భుతం.. 2.ఓ ప్రీ రిలీజ్ లో రజిని

-

శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ ఈ గురువారం రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరిగింది. రజిని, అక్షయ్ కుమార్, శంకర్ ఈ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కు అటెండ్ అయ్యారు. రోబో టైంలోనే త్రిడి ఆలోచన ఉండగా ఈసారి మంచి కథ వస్తే త్రిడి ట్రై చేద్దామని అనుకున్నామని అన్నారు రజిని.

రోబో ఆడియోలో శంకర్ కు తెలుగు రాదు అయినా ఇప్పుడు నేర్చుకున్నాడు. కథకు తగినట్టుగా అంతా కుదిరితే సినిమా అద్భుతం అవుతుందని బాహుబలి ప్రూవ్ చేసింది. అలానే ఈ 2.ఓలో కూడా మంచి కథకుం, గ్రాఫిక్స్, యాక్షన్ అన్ని తోడయ్యాయని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో సినిమా టైంలో శంకర్ కాస్త డిప్రెషన్ అయ్యాడని అన్నారు రజిని. ఇక అక్షయ్ కుమార్ మాత్రం 2.ఓ సినిమా తనకు ఓ స్కూల్ లాంటిదని అన్నారు. సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తనకు మేకప్ వేసుకోవడం తప్ప సినిమా షూటింగ్ అంతా ఎంజాయ్ చేశానని చెప్పారు అక్షయ్ కుమార్.

సినిమా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారని. తప్పకుండా సినిమా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో సినిమాలో మెసేజ్ కూడా ఉందని అది ఏంటో మరో మూడు రోజుల్లో మీరు చూస్తారని చెప్పారు. సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news