విశాఖ: ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారారని సీపీఐ నేత కొనకళ్ల నారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశరాజకీయాల్లో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. ఈసీ, ఆర్బీఐ, సీబీఐని మోదీ నాశనం చేశారని నారాయణ ఆరోపించారు.
ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడం లేదన్నారు. చింతమనేనిని అరెస్టు చేయడానికి ఎందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అన్నారు.