BAN VS NZ :ఢాకా టెస్ట్ లో తడబడుతున్న బంగ్లాదేశ్…!

-

బంగ్లాదేశ్ ఆతిధ్యం ఇస్తున్న టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్ట్ లు ఆడనున్నాయి, మొట్టమొదటి టెస్ట్ లో ఆతిధ్య బంగ్లాదేశ్ కివీస్ ను ఘోరంగా ఓడించి సిరీస్ లో ముందంజ వేసింది. ఇక ఆఖరి దైన రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదటి మ్యాచ్ లో చూపించినంత ప్రదర్శన ఈ టెస్ట్ లో చూపించలేకపోతున్నారు. ప్రస్తుతం బంగ్లా ఇన్నింగ్స్ చూస్తే కేవలం 109 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మదుల్ హాసన్ 14, జకిర్ హాసన్ 8, శాంటో 9, మోమినుల్ 5 మరియు రహీం 35 లు అవుట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మరియు మిచెల్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఇక ఈ టెస్ట్ లో బంగ్లా కనీసం రెండు వందలకు పైగా చేయాలంటే చాలా కష్టపడాలి. మరి బంగ్లా చివరి వరుస ఆటగాళ్లు రాణించి మొదటి ఇన్నింగ్స్ లో గౌరవప్రదమైన స్కోర్ ను అందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news