మేకోవర్ అంటే తమిళ హీరోల తర్వాతే.. అసురన్ ఫస్ట్ లుక్ ధనుష్ దుమ్ముదులిపాడు..!

-

తాము ఎంచుకున్న పాత్రకు తగిన మేకప్.. బాడీ లాంగ్వేజ్.. లుక్ ఇలా అన్ని విషయాల్లో హీరోలు తమ శరీరాకృతి మార్చుకుంటారు. హీరోగా తమ ఫ్యాన్స్ ను మెప్పిస్తూనే ప్రయోగాలకు సిద్ధమవుతారు. అయితే తెలుగు హీరోల కన్నా తమిళ హీరోలు ఈ విషయంలో కొంత ముందడుగులో ఉంటారు. పాత్రకు తగినట్టుగా వారిని వారు మార్చుకునే తీరు అద్భుతం. లేటెస్ట్ గా ఆ విషయం మరోసారి ధనుష్ అసురన్ ఫస్ట్ లుక్ తో ప్రూవ్ అయ్యింది.

వెట్రీమారన్ డైరక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా అసురన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సినిమాలో ధనుష్ మాస్ లుక్ అబ్బో అదరగొట్టేస్తుంది. ఎంచుకున్న రోల్ కోసం మేకోవర్ అందరు చేస్తారు కాని తమిళ హీరో ఆ పాత్రే దిగి వస్తే ఎలా ఉంటుందో అలా చేస్తారు. అయితే తెలుగు హీరోలు ఈ విషయంలో ఇప్పుడిప్పుడే పోటీ పడుతున్నారు.

అసురన్ లో మాసిన గడ్డంతో లాల్చి పైజాం వేసుకుని తల పాగ చుట్టుకుని ధనుష్ అసలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. పక్కాగా ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి పేరు వస్తుందని అంటున్నారు. సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి కొడుకులుగా ధనుష్ కనిపిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news