ధనుష్ సార్ ట్విట్టర్ రివ్యూ..!

-

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ మొదటిసారి చేస్తున్న తెలుగు చిత్రం సార్.. ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈరోజు విడుదలై మొదటి షో తోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సంయుక్త మేనన్ ధనుష్ సరసన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేయగా.. భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా సమాజంలో ఉన్న విద్యా వ్యవస్థలో ఏర్పడిన లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా రిలీజ్ చేశారు..ఇక సినిమా ఈరోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

నిన్న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రీమియర్స్ చూస్తున్న అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ రెస్పాన్స్ ను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా చూపించాడు అని చెప్పవచ్చు. ఈ సమాజంలో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారంగా మారింది? చదువుని అడ్డుపెట్టుకొని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ.. కొంతమంది ఎలా కోట్లు సంపాదిస్తున్నారు? అనే విషయాలను చాలా చక్కగా చూపించారు.. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరొకవైపు ఇన్స్పైర్ చేసే విధంగా.. ఆలోచింపచేసే విధంగా ఆయన రచన ఉంది.. ధనుష్ నటన అయితే గూస్వంత్ తెప్పించాయి. చివరిలో ఎమోషనల్ తో కట్టిపడేశాడు.

ధనుష్ సినీ కెరియర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలవబోతోంది అంటూ ఇది చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా సన్నివేశాలు మంచి హైప్ ఇచ్చాయి.. కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుంది ఇంటూ ఇలా చాలామంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news