ఇవాళ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

-

ఇవాళ హైదరాబాద్​ జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. కృష్ణా ప్రాజెక్టు కింద అవసరాలకు అనుగుణంగా నీటిని పంపిణీ చేసే విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ నారాయణరెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

డిసెంబరులో జరగాల్సిన కమిటీ సమావేశం ఇప్పటికి చాలా సార్లా వాయిదా పడింది. ఎట్టకేలకు మళ్లీ ఇవాళ సమావేశం జరగనున్నందున ఈ భేటీలో ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఆయా రాష్ట్రాలకు ఏ మేరకు నీరు అవసరం ఉంటుందన్న అంశాన్ని చర్చించి పంపిణీని ఖరారు చేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిన్నటి వరకు 34 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. నీటి తోడుకునే కనీస మట్టం స్థాయి వరకు (ఎండీడీఎల్‌) 18 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లో 90 టీఎంసీల లభ్యత ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నీటి సంవత్సరం ముగిసే (మే 31వ తేదీ) నాటికి రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రాల వాటా మేరకు వినియోగం పోను మిగిలిన నీటిని పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news