రిజిస్ట్రేషన్ లు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ధరణి అనే ఒక పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో 106 కోట్ల 15 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని ప్రభుత్వం తెలిపింది. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్ల పురోగతి గురించి ప్రభుత్వం వివరించింది. నవంబర్ 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 89 వేల 851 లావాదేవీలు జరిగాయి. 66 వేల 614 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు కోటి 35 లక్షల మంది ధరణి పోర్టల్‌ని సందర్శించినట్టు తెలిపింది ప్రభుత్వం. ఇక నేటి నుండి తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిష్ట్రేషన్లు జరగనున్నాయ్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి కొనసాగుతున్న ప్రస్తుత విధానాన్ని నిలిపివేసింది ప్రభుత్వం.