కోటి రూపాయలు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్గా పని చేస్తున్న నాగరాజు పట్టుబడడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కీసర మాజీ తాసిల్దార్ నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మ్యూటేషన్ ఆరోపణలతో ధర్మారెడ్డిని కూడా ఏసిబి అరెస్ట్ చేసింది.
కీసర ఎమ్మార్వో నాగరాజుతో తాము ఒరిజినల్ ఓనర్ లు కాకపోయినా తమ బంధువుల పేర్లమీద పట్టా పాస్ బుక్కులు చేయించుకున్నట్టు ఏసీబి ఆరోపపిస్తూ ఈయన్ని ఈయన కుమారుడిని అరెస్ట్ చేసింది. రాంపల్లి దయారా గ్రామంలో నలభై ఎనిమిది కోట్ల విలువ చేసే ఇరవై నాలుగు ఎకరాల 16 గుంటల భూమిని తమ పేరు మీద ధర్మారెడ్డి రాయించుకున్నటు చెబుతున్నారు.
ఈ భూమి విషయంలోనే ధర్మారెడ్డి తో చేతులు కలిపి ఫోర్జారీ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేసినట్టు మాజీ ఎమ్మార్వో నాగరాజు పై ఆరోపణలు వచ్చాయి. 33 రోజులుగా జైలు జీవితం గడిపిన ధర్మారెడ్డి మొన్ననే బెయిల్ మీద బయటకి వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన తాజాగా కుషాయిగూడ, వాసవి శివ నగర్ లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. దర్మారెడ్డి వయస్సు ప్రస్తుతం 80 ఏళ్లు ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. అయితే మరి ధర్మా రెడ్డి ఎందుకు ఆతహత్య చేసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.