అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం : మంత్రి ధర్మాన

-

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఎలాంటి ఉద్యమాలు లెకుండానే దీర్ఘకాలిక సమష్యలకు పరిస్కారం చేశాం.. అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.. ద్రబాబు కూడా అవినీతి చేసామని మాట్లాడటం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు డబ్బు ఇస్తే దుర్వినియోగం అయిపొతుందన్నారు.. పరిస్దితులు చూసి తాను అధికారంలొకి వస్తే తాను డబ్బులు ఇస్తామంటున్నాడు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యనించారు. సీఎం జగన్ పేదల కోసం ఆలోచిస్తే, చంద్రబాబు దృష్టి అంతా ధనవంతులు, దోపిడిదారులపై ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు.

Dharmana Prasada Rao Political History : రాజకీయ ప్రస్థానం.. ఆరుగురు  ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత ఈయ‌న‌దే.. | Sakshi Education

పేద, ధనిక మద్య అంతరాలను తొలగించాలనే మార్పు జగన్ చేస్తున్నారు.. దేశంలో ఇతర ప్రాంతాలు కూడా అనుసరించాల్సిన పాలన ఇస్తున్నాం.. జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్దికి సూచికలు.. ఇల్లు లేఖ అవస్థలు పడుతున్న వారికి ఇవ్వడం అభివృద్ది కాదా?.. రాజధాని మార్కెట్ ని క్రియేట్ చేసి , తనవాళ్లకు ప్రయొజనం చెయాలని బాబు తాపత్రయపడ్డారు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చెప్పుకొచ్చారు. శ్రీకాకుళంపై చంద్రబాబుకి ఏం ప్రేమ ఉంది అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. ఉద్దానంకు నీరు తెచ్చావా? హాస్పటల్ కట్టారా.. ఒక్క ప్రొజెక్ట్ చేసారా బాబు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అభివృద్ధి చేయటానికి ఆలోచన ప్రారంభిస్తారంట.. ముఖ్యమంత్రిగా బాబు ఉన్నప్పుడు ఏం చేశారు.. మూలపేట పోర్ట్ తో జిల్లా ముఖచిత్రం మారబోతుంది.. కుర్రాళ్లు ఆలోచించాలి ఎలాంటి ప్రభుత్వం రావాలో కోరుతున్నాను అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news