ఒవైసీకి ధర్మపురి అరవింద్ కౌంటర్, ఆ పని ఆపండి ముందు…!

యుఏపీఏ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది. దీనిపై బిజెపి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా దీనిపై బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ స్పందించారు. దేశ వ్యతిరేకులను రక్షించడం ఒవైసీ ఆపాలని ఆయన సూచించారు.

యుఎపిఎ కఠినమైన చట్టం అని, ముస్లిం లను దళితులను ఇబ్బంది పెట్టే చట్టం అని ఒవైసీ శనివారం ట్వీట్ చేసారు. అసమ్మతి వాదులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… “యుఎపిఎ చట్టానికి వ్యతిరేకంగా ఒవైసీ చేసిన ట్వీట్‌ను నేను చూశాను, మీరు (ఒవైసి) మొదట దేశ వ్యతిరేకతను రక్షించడం మానేయాలి. ముఖ్యంగా మీ ప్రాంతంలో… ప్రధాని మోడీ తీసుకువచ్చిన ఈ చట్టం దేశంలో ఏ అమాయకుడిని బాధ పెట్టే అవకాశం లేదని, శిక్షించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు.