పార్లమెంట్‌లో ధర్నాలు, దీక్షలు నిషేధం

-

త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నాలు, నిరాహార దీక్షలు, సమ్మె, మతపరమైన వేడుకలను పార్లమెంట్ ఆవరణలో నిర్వహించొద్దని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘విశ్వగురు మరో కొత్త ఆయుధం తీసుకొచ్చారు.. పార్లమెంట్‌లో ధర్నాలపై నిషేధం విధించారు.’ అంటూ ఆరోపించారు. అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఆరోపించారు. పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయంపై నేడు ఢిల్లీలో రాజకీయ నేతలు సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.

పార్లమెంట్
పార్లమెంట్

జులై 18వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే లోక్‌సభ నిషేధిత పదాలను జాబితాను రూపొందించింది. సిగ్గుచేటు, డ్రామా, అవినీతి పరుడు, పిరికివాడు, అహంకారి పదాలను వాడకూడదు. దీనిపై విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ‘పార్లమెంట్ సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ఈ నియమాన్ని తీసుకొచ్చామన్నారు. 1959 నుంచి ఈ పద్ధతి కొనసాగుతోందన్నారు. పార్లమెంట్‌లో వాడకూడని పదాలతో బుక్‌లెట్ తయారు చేశామని, ఇది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news