ఆ స్టార్ హీరో మూవీలో నటిస్తున్న ధోనీ?

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్‌, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే…’ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇండియా జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ నటించనున్నట్లు సమాచారం.క్రికెట్కు సంబంధించిన సన్నివేశాల్లో ధోనీ గెస్ట్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news