కూటమి పేరుతో కుట్రలు.. మోసగాళ్లను నమొద్దు : సీఎం జగన్

-

కూటమి పేరుతో కుట్రలు.. మోసగాళ్లను నమ్మొద్దని సీఎం జగన్ ప్రజలకు సూచించారు. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్ కి అండగా నిలిచేందుకు నేను సిద్ధం.

సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? మా పెత్తందార్లను ఓడించేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అని అడిగారు.  58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మనం చేసిన మంచి కొనసాగాలని ప్రతి గుండె కోరుకుంటోంది. పేదలంతా ఒక వైపు, పెత్తందారులు మరో వైపు. పేదల వ్యతిరేకులను ఓడించండి.. మీ బిడ్డను గెలిపించండి అని పిలుపునిచ్చారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news