ధోని ఫ్యాన్స్ యాక్షన్.. మైక్రోబ్లాగింగ్ సైట్ రియాక్షన్.. అసలేం జరిగిందంటే?

-

క్రీడా లోకానికి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోని క్రికెటర్ మాత్రమే కాదు ఫార్మర్ ప్లస్ బిజినెస్‌మ్యాన్ కూడా. తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ధోని కడక్ నాథ్ కోళ్లను పెంచి అమ్ముతూ లాభాలు కూడా పొందుతున్నాడు. కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడగా, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా గడుపుతున్నాడు. తాజాగా ధోని సోషల్ మీడియాలో ట్రెండయ్యారు. ఆయన ఫ్యాన్స్ వల్లే ఇలా జరిగింది. ఇంతకీ ఆయన ఫ్యాన్స్ ఏం చేశారంటే…

క్రికెటర్ ధోని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా లేనప్పటికీ ఎప్పుడో ఒకసారి అవసరాన్ని, టైమ్ పర్మిట్‌ను అప్‌డేట్స్ ఇస్తుంటారు. కాగా, ధోని ట్విట్టర్ అకౌంట్‌కు ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్‌ను తీసేసింది. బ్లూ టిక్‌ను ట్విట్టర్ సంస్థ ఎందుకు తీసేసింది? అన్న విషయం తెలియదు. కానీ, మొత్తానికైతే తీసేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ లేకపోవడం వల్లే బ్లూ టిక్‌ను ట్విట్టర్ తీసేసిందని కొందరు పేర్కొనగా, ట్విట్టర్ అయితే ఎందుకు అలా చేసిందో సమాధానం చెప్పలేదు. అయితే, బ్లూ టిక్ తీసేయడం ద్వారా తమ అభిమాన క్రికెటర్ ధోని పట్ల ట్వట్టర్ వివక్ష చూపుతున్నదని ధోని ఫ్యాన్స్ భావించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ పట్ల నెగెటివ్ కామెంట్స్ విపరీతంగా చేస్తూ ట్రోల్ చేయడం షురూ చేశారు. మొత్తంగా మహీ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చింది మైక్రోబ్లాగింగ్ సైట్. ధోని ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్‌ను వెంటనే అప్‌డేట్ చేసింది. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన నెటిజన్లు, ధోని ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు గౌరవం తిరిగి ఇచ్చారంటూ ట్విట్టర్‌కు థాంక్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news