వ్యాక్సిన్ వేసుకోని సిబ్బంది.. సంస్థ ఏం చేసిందంటే..

-

ప్రస్తుత కరోనా మహమ్మారి ఒకరనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అసలు ఇటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ వల్ల జరిగిన విధ్వంసం తలుచుకుంటేనే ఒళ్లు భయంతో చలించిపోతుంది. అయినా కూడా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా కేసులు పెరిగేందుకు కారణమవుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంత మంది నిపుణులు సూచిస్తున్నా, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు.

ఇటీవల చాలా దేశాలలో మరలా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సమసి పోయిందనుకున్న సమస్య తిరిగి వచ్చేసరికి చాలా దేశాల్లో ప్రభుత్వాలకు ఏం చేయాలో తోచట్లేదు. ఇక కరోనా భయాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ సిబ్బంది తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. కానీ కొంత మంది సిబ్బంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇలానే సీఎన్ఎన్ వార్తా సంస్థలో పని చేసే ముగ్గరు సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వచ్చారని తెలసి తొలగించినట్లు సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుకర్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టే సిబ్బంది అసలు కే సహించమని జెఫ్ స్పష్టం చేశారు. కానీ కేవలం ఆయన ముగ్గరు ఉద్యోగులను తొలగించినట్లు మాత్రమే ప్రకటించారు. వారు ఎవరూ అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆఫీసులో ఉండే వారితో పాటు ఫీల్డ్ రిపోర్టింగ్ కు వెళ్లే వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మరలా కరోనా కేసులు భారీగా వస్తుండడంతో అమెరికాలో వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news