ఢిల్లీపై చెన్నై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మంచి పామ్‌లో ఉన్న ఢిల్లీపై 91 పరుగుల తేడాతో ధోని సేన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది. ల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 25, శార్దూల్ 24, పంత్ 21, వార్నర్ 19 మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించారు.
అయితే.. చెన్నై బౌలర్లు రెచ్చి పోవడంతో.. ధోనీ టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ ధోని అరుదైన ఫీట్ సాధించాడు. ఈ లీగ్ డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు ధోని.
15 ఏళ్ల ఈ మెగా లీగ్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ.. తనలో ఫినిషనర్ ఇంకా బతికే ఉన్నాడని అవకాశం దొరికినప్పుడల్లా రుజురు చేస్తూనే ఉన్నాడు ధోని. అలాగే.. ఈ మ్యాచ్ లో తన ఐపీఎల్ కెరీర్ లో 6 వేల మైలురాయిని కూడా పూర్తి చేసుకున్నాడు.