మహిళల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే ఇలా తప్పక చెయ్యాలి..

-

మహిళలకు కాల్షియం, ఐరన్ లు సరైన మోతాదులో ఉండాలి..లేకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది మహిళల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది.శరీరానికి అవసరమైన వాటిని ఆహారంలో భాగం చేసుకోకుండా చాలా మంది అనవసరమైన ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకుంటూ శరీరంలో పోషకాల లోపం ఏర్పడేలా చేసుకుంటున్నారు.తగినంత కాల్షియం ఉంటేనే ఎముకులు పఠిష్టంగా ఉంటాయి. సప్లిమెంటరీ మందుల ద్వారా కాకుండా తినే ఆహార పదార్ధాల ద్వారా సమకూర్చోవటం మంచిది.

పౌష్టికాహారాన్ని తీసుకోవటం ద్వారా ఎముకలను బలంగా తయార చేస్తున్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకొవాలని అంటున్నారు. మధ్య వయస్సు మహిళల్లో ఎముకలు పెళుసుగా ఉంటాయి. ఇలాంటి వారికి జింక్ చాలా అవసరం. మాంసాహారులైతే జింక్ సమృద్ధిగా లభించే గొర్రెమాంసం తినవచ్చు. ఇక శాఖాహారులు ఆకు కూరలు, తమలపాకులు వంటి వాటిని తీసుకోవచ్చు. తోటకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.ఈ విటమిన్ శరీరానికి కావలసిన కాల్షియంను అందిస్తుంది.

విటమిన్ కె అస్ట్రియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారిలో ఎముకలలో ఖనిజ లవణాల ప్రమాదాలు పెరగటానికి దోహదం చేయడమేగాక ఎముకలు చిట్లిపోవటం  వంటి సమస్యలను తగ్గించడంలో దోహద పడుతుంది.మనం తినే ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి.ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రం ద్వారా కాల్షియం బైటకు పోతుంది. అందుకే ఉప్పును తక్కువగా తీసుకోవటం మంచిది. తోటకూర, బచ్చలి, పొన్నగంటి కూర, కొత్తిమీర, లాంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది..కాల్షియం తగినంత ఉంటేనే ఎముకలు,దంతాలు బలంగా ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news