ఐపీఎల్ పై ధోనీ కీలక ప్రకటన…కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నారా?

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఎమ్ఎస్ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. అయితే, సీజన్ ప్రారంభం వేళ చెన్నై అభిమానులను ధోని కలవరపాటుకు గురిచేశారు. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. దీంతో అటు చెన్నై అభిమానులు, ఇటు ms ధోని అభిమానులలో టెన్షన్ పెరిగిపోయింది.

MS Dhoni 

అసలు ఆ పోస్టులో ఏం పెట్టారంటే….కొత్త సీజన్, “కొత్త పాత్ర” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. దీని గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తా’ అని పేర్కొన్నారు. ధోనీ చెప్పిన ఆ “కొత్త పాత్ర” ఏంటన్నదానిపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ మొదలైంది. కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. కోచ్ లేదా మెంటార్ అవతారం ఎత్తనున్నారా? లేదా యాడ్ కి సంబంధించి ఈ పోస్ట్ పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news