స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి భార్య

-

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కంటతడి పెట్టారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన భర్తను గుర్తుచేసుకున్న ఆమె జేఎంఎం పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘బరువెక్కిన హృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చా అని అన్నారు. మా మామ, అత్త తమ కుమారుడిని తలుచుకుని రోజూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అని తెలిపారు. మీరే నా బలం’ అంటూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి గద్గద స్వరంతో ఆమె మాట్లాడారు.

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

గిర్డిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా 51 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు. జార్ఖాండ్ గ్రౌండ్స్‌లో ఈ దినోత్సవాన్ని ‘అక్రోష్ దివస్’గా నిర్వహించారు. ”ఈ రోజు నా బర్త్ డే. అత్తమామల ఆశీస్సులు తీసుకున్నాను, నా భర్తను కూడా ఉదయం కలుసున్నాను” అని కల్పనా సోరెన్ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news