షాకింగ్: ఒకే వ్యక్తిలో ఒకేసారి 3 ప్రాణాంతక వైరస్‌ల నిర్ధారణ.. ఎక్కడంటే?

-

ఒకే వ్యక్తిలో ఒకేసారి మూడు ప్రాణాంతకమైన వైరస్‌లను వైద్యులు గుర్తించారు. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో ఒకేసారి కరోనా వైరస్, మంకీపాక్స్, హెచ్‌ఐవీ వైరస్‌లను కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన నివేదిక ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీకి చెందిన ఈ వ్యక్తి ఐదు రోజులపాటు స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడి వెళ్లి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత తీవ్ర జ్వరం, తలనొప్పి, వొళ్ల నొప్పులు, తొడ దగ్గర వాపులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

కరోనా-మంకీపాక్స్-హెచ్ఐవీ
కరోనా-మంకీపాక్స్-హెచ్ఐవీ

పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ లక్షణాలను గుర్తించారు. దీంతో వైద్యులు అతడికి మెరుగైన చికిత్సను అందజేశారు. కరోనా టీకా రెండు డోసులు అందించగా.. కోవిడ్, మంకీపాక్స్ నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీకి మాత్రం చికిత్స పొందుతున్నారు. కాగా, రోగ నిర్ధారణ సమయంలో ఈ తరహా కేసులు పరిశోధనకు కీలకంగా మారుతాయని పరిశోధకులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news