‘డయల్‌100’తో ఇకపై క్షణల్లో ఆ స్థలానికి..

-

ఆపత్కాంలో ఉన్నప్పుడు బా«ధితులు ‘డయల్‌100’కు కాల్‌ చేస్తే వారికి సాయం అందించేందుకు పోలీస్‌ శాఖ క్షణల్లో సిద్ధమవుతోంది. కానీ.. వారు ఎక్కడున్నారో.. గుర్తించడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఫోన్‌ చేశారో అక్కడికి క్షణల్లో చేరేలా ‘డయల్‌100ను’ మరింత నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఫిర్యాదు అందిన వెంటనే గస్తీవాహనాలు అక్కడికి వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. తద్వారా బాధితులు ఉన్న ప్రాంతం కంట్రోల్‌ రూమ్‌లో కన్పించేలా లోకేషన్‌ బెస్ట్‌ సర్వీస్‌ (ఎల్‌బీఎస్‌)ను తీసుకురానున్నారు.

ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు 7 ఏళ్లక్రితం డయల్‌100 వంద సౌకర్యాన్ని కల్పించింది. గతంలో వాహనాలు తక్కువగా ఉండటంతో అందరికీ సత్వర న్యాయం జరిగేది కాదు. ప్రçస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 800 కార్లు, 1500 వందల బైక్‌లు అందుబాటులో ఉన్నావి. అయినా సాంకేతిక సమస్యల కారణంగా బాధితులు ఫోన్‌ చేసినా వారున్న ప్రాంతం, ల్యాండ్‌ మార్క్‌ కచ్చితమైన సమాచారాన్ని సేకరించి సమీపంలోని స్టేషన్‌ను అప్రమత్తం చేసేవారు. అందుకు దాదాపుగా 510 నిమిషాల సమయం పట్టేది. దీంతో అక్కడ జరగారాని నష్టం జరిగిపోయేది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావతం కారాదనే ఉద్దేశంతో ఎల్‌బీఎస్‌ను వినియోగించనున్నారు.

పనితీరు ఇలా..

ఏ ప్రాంతం నుంచైనా బా«ధితులు డయల్‌100కు పోన్‌ చేసినా వారు ఎక్కడి నుంచి చేశారు కంట్రోల్‌ రూమ్‌లో స్పష్టంగా ఆ ప్రాంతం కన్పిస్తోంది. దీంతో వారు సమీపంలోని స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో పోలీస్‌ వాహనంతో ఉన్న ట్యాబ్‌ మ్యాప్‌ద్వారా ఆ ప్రదేశాన్ని సూచిస్తుంది. బాధితులు ఫోన్‌లో జీపీఎస్‌ లేకున్నా ఎల్‌బీఎస్‌ ద్వారా సులువుగా అక్కడికి చేరుకోవచు. త్వరలోనే ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా అమలుకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news