ఆ చిన్నదానికి బాబు డిప్రెషన్ లోకి వెళ్లి పోయారా…?

-

రాజకీయాల్లో అనుకున్నది ఒక్కటి జరిగేది ఒకటి. అది ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, రాజకీయాల్లో ఊహించినది జరగడం అనేది చాలా కష్టం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఆయన ఊహించింది ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒకటి. అసలు ఆయ నేం ఊహించారు, అక్కడ జరుగుతుంది ఏంటి.

ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎక్కువగానే సందడి చేస్తున్నారు. ఆయన సందడి చూసి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే అభిమానులు సీఎం జగన్ వ్యతిరేకులు చాలామంది ఏదో జరుగుతుంద ని ఎదురుచూసిన పరిస్థితి ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని ఆశించిన వారిలో చంద్రబాబు నాయుడు కూడా ముందు వరుసలో ఉన్నారు. రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో సీఎం జగన్ ఏం కఠిన నిర్ణయం తీసుకోక పోవడంతో ఆయనకు బీజేపీ అండ ఉంది అని ప్రచారం ఎక్కువగా రాజకీయ వర్గాల్లో జరుగుతూ వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లడం అక్కడ కేంద్రమంత్రులను కలవడం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకంగా సీఎం జగన్ ని కూడా పరోక్షంగా విమర్శలు చేయడంతో చాలా మంది విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూశాం. అయితే రఘురామకృష్ణంరాజు పార్టీ మారతారు అని చంద్రబాబు నాయుడు చాలా ఆశగా ఎదురుచూశారు.

అంతే కాకుండా ఆయన వెళ్లే సమయంలో కొంతమంది కీలక నేతలను కూడా తీసుకుని వెళ్లే అవకాశం ఉంది అని చంద్రబాబు నాయుడు భావించారు. ఇక బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి విషయంలో కూడా చంద్రబాబు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన అసహనంగా ఉన్నారని ఆయన కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారని త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని ఆయన ఆశించారు. వాళ్ళిద్దరూ పార్టీ మారితే వైసీపీలో ఒత్తిడి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. వారితో పాటు బీజేపీ లోకి వెళ్ళాలి అని భావిస్తున్న ఒక నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు భావించారు. అదే జరిగితే బీజేపీని ఎదుర్కోవడం అనేది సీఎం జగన్ కి రాష్ట్ర పరిధిలో కాస్త కష్టంగానే ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బిజెపి ఏదైనా రాష్ట్రంలో చేసే సత్తా ఉంటుంది. బీజేపీని కాదని సీఎం జగన్ కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే దాదాపుగా ఉండకపోవచ్చు.

ఇవన్నీ ఏది జరగకపోగా తాజాగా కొన్ని వార్తలు చంద్రబాబు నాయుడు ని మరింతగా కలవరపెడుతున్నాయి. జగన్ కు బిజెపి… హిందూత్వ వాదం ద్వారా దూరం అవుతుంది అని ప్రచారం కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతుంది. సోషల్ మీడియాలోనే కాదు చంద్రబాబు నాయుడు కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ రాష్ట్రంలో బిజెపి వైసీపీకి సోము వీర్రాజు నీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన తెలుగుదేశంకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని భావించి… కన్నా లక్ష్మీనారాయణను దాదాపుగా పక్కన పెట్టింది. ఆయనను కేంద్ర పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం బీజేపీ నేతలు కూడా చాలా వరకు చేస్తూ వచ్చారు. కానీ అదేమీ నిజం కాదని ఆయన కేవలం చంద్రబాబునాయుడికి సన్నిహితంగా ఉండటంతో నీ పక్కన పెట్టారు అని అందరూ భావిస్తున్నారు.

బిజెపికి సీఎం జగన్ దూరం జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు చాలా వరకు వచ్చాయి. వాటిని కూడా చంద్రబాబు దాదాపుగా ఆయన చాలా ఆశలే పెట్టుకున్నారు కానీ అక్కడ చంద్రబాబు అనుకున్నవి ఏమీ జరగడం లేదు దీంతో చంద్రబాబు నాయుడు డిప్రెషన్ లో ఉన్నారని, రఘురామకృష్ణంరాజు సైలెంట్ గా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తున్నారని అలాగే అసలు వైసీపీ నుంచి ఎవరూ బయటికి వెళ్లే అవకాశం లేదు అని రాజకీయ పరిశీలకులు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news