సమంత అవి తినడం వల్లే.. ఈ వ్యాధి బారిన పడిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా మయో సిటీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే అయితే ఈ వ్యాధి రావడం వల్ల కండరాల్లో శక్తి క్షీణించిపోతుంది అని వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తాయి. అయితే ఈ విషయాన్ని తానే స్వయంగా పోస్ట్ చేస్తూ వెల్లడించింది. జీవితంలో కొన్ని సమస్యలతో పోరాడి బయటపడాలని.. త్వరలోనే తాను రికవరీ అవుతానని కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ వారు, అభిమానులు , నెటిజన్స్ అందరూ కూడా సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ కూడా చేస్తున్నారు.

నిజానికి సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ క్రమంలోని సమంత బాధపడుతున్న ఈ వ్యాధి గురించి అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? దేనివల్ల వచ్చింది? అని అభిమానులు సెర్చ్ చేయడంతో దాని గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నిపుణులు చెబుతున్న విషయం ప్రకారం.. సమంతా కి సోకిన ఈ వ్యాధి 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఎక్కువగా వస్తుందట.

Samantha and Naga Chaitanya's hot holiday pics go viral - Tamil News - IndiaGlitz.com

అయితే పిజ్జాలు , బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని.. మయో సిటీస్ వచ్చిన తర్వాత ఈ జంక్ ఫుడ్ పూర్తిగా మానేస్తేనే మంచిదని చెబుతున్నారు. సమంత వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడినట్టు సమాచారం.

ప్రస్తుతం సమంత తాను నటించిన యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది. మరోవైపు హిస్టారికల్ మూవీ శాకుంతలం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా కూడా థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news