రేవంత్ రెడ్డి వెనుక బాబు: టీ-కాంగ్రెస్ బాబు గ్రిప్‌లోకి వచ్చిందా?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీని చాలామంది నాయకులు వీడిపోయారు. ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.

రేవంత్ రెడ్డి/revanthreddy

తెలంగాణలో టీడీపీ కనుమరుగవ్వడంతో చంద్రబాబు టీ కాంగ్రెస్‌ని తన గ్రిప్‌లోకి తెచ్చుకోవడానికి తన శిష్యుడైన రేవంత్‌కు పీసీసీ దక్కేలా చేసుకున్నారని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే పీసీసీ దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ కాస్త టీటీడీపీ మాదిరిగా తయారైందని మాట్లాడారు. పీసీసీ పదవిని కొనేశారని ఆరోపించారు.

విజయసాయి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలని కొనేశారని అన్నారు. అలాగే తనపై కేసులు రాకుండా చూసుకోవడానికి నలుగురు ఎంపీలని బీజేపీలోకి పంపారని, ఓటుకు నోటు కేసు లేకుండా ఏకంగా పార్టీ అధ్యక్షుడు రమణనే టీఆర్ఎస్‌లోకి పంపిస్తున్నారని, ఇప్పుడు తన శిష్యుడుకు పీసీసీ ఇప్పించుకుని కాంగ్రెస్‌ని కబ్జా చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

అయితే కోమటిరెడ్డి, విజయసాయి వ్యాఖ్యలు కొట్టిపారేయడానికి లేదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్‌కు పీసీసీ దక్కేలా చేయడంలో బాబు హస్తం ఉందని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. పైగా టీడీపీ నుంచి వచ్చిన నేతలకే కాంగ్రెస్‌లో పెద్ద పీఠ వేసేలా కనిపిస్తున్నారు. అలాగే మాజీ టీడీపీ నేతలని సైతం మళ్ళీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ పరిణామాలని బట్టి చూస్తే రేవంత్ వెనుక చంద్రబాబు ఉన్నారని అనుమానం రాక మానదని అంటున్నారు. చూడాలి రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గ్రిప్‌లోకి వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version