151 కాదు..మరోసారి మొత్తం అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తాం : ఏపీ స్పీకర్ తమ్మినేని

-

వచ్చే ఎన్నికల్లో వచ్చేది నిశ్శబ్ధ విప్లవమేనని.. 151 కాదు మొత్తం అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు జుగుస్సాకరమని.. చంద్రబాబు జూమ్ ను వదిలి జనంలోకి రావాలని మండిపడ్డారు. కలుగులో ఎలకగా జూమ్ లో ఎందుకయ్యా ?బయటికి వచ్చి జనానికి భరోసా ఇవ్వు అని చురకలు అంటించారు. బయటికి వస్తే కరోనా వచ్చి ప్రాణాలు పోతాయని భయమా? నీది, నీ కొడుకువేనా ప్రాణాలు అని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి మీరు మాట్లాడటమేంటి …సిగ్గుచేటు.. జాబు కావాలంటే బాబు రావాలన్నారు …నిరుద్యోగులకు ఏం చేశారని నిలదీశారు.

మా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ను విమర్శించే అర్హత మీకు లేదని.. ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేయడం ఏమాత్రం బాగోలేదన్నారు. టీడీపీ నేతల పొలికేకలను జనం పట్టించుకునే పరిస్థితి లేదని.. నాయకుడి డైరెక్షన్ ఒకటి….టీడీపీ నేతల యాక్షన్ మరొకటి అని మండిపడ్డారు. అరిచి గోల చేసినంత మాత్రాన నిజం అబ్ధం అయిపోదు…అబద్ధం నిజం అయిపోదన్నారు. ప్రభుత్వంలో లోపాలుంటే ఎత్తిచూపండి…మేం సరిచేసుకుంటామని పేర్కొన్నారు తమ్మినేని సీతారాం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version