సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ లో వెలుగులోకి వచ్చిన రేప్ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ఘటనలో రేప్ జరిగిందా లేదా అనేది స్పష్టత రావడం లేదు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. షాప్ వద్దకు వచ్చిన బాలికను న్యూడ్ వీడియోలు ఉన్నాయని ఒక వ్యక్తి ఎక్కించుకుని వెళ్ళాడని,
ఆమెను కారులో ముగ్గురు యువకులు ఎక్కించుకుని వెళ్ళారు అనేది అబద్దమని పోలీసులు నిర్ధారించారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం అసలు బాలిక మీద ఏ అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రేప్ జరిగింది అనే ప్రచారంలో వాస్తవం లేదని బాలిక అతని చెరలో 5 గంటలు ఉన్న మాట నిజమని చెప్పారు. అయితే ఆమెను ఎవరు ఎక్కించుకుని వెళ్ళారు అనేది,
స్పష్టత లేదని చెప్పిన పోలీసులు అమీనాపూర్ లో పవర్ హాలిడే కారణంతో సీసీ కెమెరాలు పని చేయలేదని దీనితో నిందితులు ఎవరు అనేది గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో బాలిక తీరుపై కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు న్యూడ్ వీడియోలు ఉన్నాయని చెప్పగానే ఎందుకు నమ్మింది…? ఆమెకు అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.