టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంపీలు రాజీనామా చేశారా : ఎమ్మెల్యే అంబ‌టి

-

చంద్ర బాబు అధికారంలో ఉన్నప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేశారా.. అని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజీనామా చేయ‌డం ఎంటి అన్నారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌మ పార్టీ మాట త‌ప్ప‌దని మ‌డ‌మ తిప్ప‌ద‌ని అన్నారు. నిజానికి ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా రాకుండా చేసింది చంద్ర బాబు అని ఆరోపించారు. ప్యాకేజీలు తీసుకుని ప్ర‌త్యేక హోదా కు అడ్డు ప‌డ్డారని విమ‌ర్శించారు.

అలాగే త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి మూడేళ్ల లో దాదాపు 1.50 ల‌క్ష‌ల కోట్లు రాష్ట్ర సంక్షేమం కోసం ఖ‌ర్చు చేశామ‌ని అన్నారు. ఓటీఎస్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అనేక లాభాలు ఉంటాయ‌ని అన్నారు. ఓటీఎస్ ఫ‌లాల‌ను పెద ప్ర‌జ‌ల‌కు అంద కుండా టీడీపీ కుట్ర చేస్తుంద‌ని విమ‌ర్శించారు. ఓటీఎస్ పై చంద్ర బాబు మాట‌ల్ని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని అన్నారు. ప్ర‌జ‌లపై ప్రేమ ఉంటే ఇళ్ల రుణాల‌ను ఎందుకు మాఫీ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు ను ప్ర‌శ్నించారు. ఓటీఎస్ లో బ‌ల‌వంతం ఏమీ లేద‌ని.. ఇష్టం వ‌చ్చిన వారు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news